ETV Bharat / state

ప్రశాంతంగా ప్రారంభమైన ఐసెట్​ పరీక్ష - icet exam

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఐసెట్ ప‌రీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 58,452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నిమిషం అమలులో ఉండడం వల్ల విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

icet exam started in telangana
ప్రశాంతంగా ప్రారంభమైన ఐసెట్​ పరీక్ష
author img

By

Published : Sep 30, 2020, 9:29 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 58,452 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా తెలంగాణలో 10 రీజినల్ కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్​లో 4 రీజినల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,900 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలపడం వల్ల విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి 12.00 గంటల వరకు జరుగుతుంది.. రెండో పేపర్ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. మరలా అక్టోబర్ 1న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. మొత్తం ఐసెట్ పరీక్షను మూడు విడతల్లో నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కు ధరించిన విద్యార్థులను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి పంపించారు. ఐసెట్ పరీక్ష ప్రాథమిక కీని అక్టోబర్ 7న, ఫలితాలను 23న విడుదల చేయనున్నారు.

ఇవీ చూడండి: టీఎస్ ఐసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్ రాజిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.