ETV Bharat / state

ఇతర ప్రాంతాల్లో కన్నబిడ్డలు.. అంత్యక్రియల్లో ధర్మపత్ని

నారాయణగిరి గ్రామంలో గుండెపోటుతో ఓ రైతు మృతిచెందాడు. అంత్యక్రియల్లో ఆయన భార్యే కుండ పట్టాల్సిన పరిస్థితి స్థానికులను కంటతడి పెట్టించింది.

husband-funeral-by-wife-at-narayangiri-village-warangal-rural-districthusband-funeral-by-wife-at-narayangiri-village-warangal-rural-district
పిల్లలు ఇతర ప్రాంతాల్లో... భార్య అంత్యక్రియల్లో
author img

By

Published : Mar 25, 2020, 4:01 PM IST

పిల్లలు ఎవరూ రాలేని పరిస్థితిలో భర్తకు భార్యే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే రైతు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుమారుడు సాయికృష్ణా రెడ్డి ఆస్ట్రేలియాలో, కుమారై నితిష బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారిద్దరూ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యే పరిస్థితిలో లేనందున ఆయన భార్య సరళ అంత్యక్రియలు నిర్వహించారు.

భర్త మరణం ఓ వైపు, మరోవైపు పిల్లలు తండ్రి చివరిచూపుకు నోచుకోలేకపోయారనే బాధతో భర్త మృతదేహాంపై పడి ఆమె విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.

పిల్లలు ఇతర ప్రాంతాల్లో... భార్య అంత్యక్రియల్లో

ఇదీ చూడండి: ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు: కేసీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.