ప్రజాప్రతినిధులందరూ ఎక్కడికి వెళ్లారంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మంత్రులు తమ జిల్లాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలన్నారు. ప్రజల బాగోగులు చూడడం మనందరి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అందుబాటులో ఉండాలని కోరారు. గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ పరిధి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు రంగంలోకి దిగాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. సర్పంచులు గ్రామ కథా నాయకులుగా మారాలన్నారు. దండం పెట్టి చెబుతున్నా ప్రజాప్రతినిధుల ముందుకు రావాలన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు