ఏడు వందల కోట్లతో పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ మండలం మామునూరు 4వ పటాలంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. త్వరలో రెండు నూతన పోలీస్ స్టేషన్లతో పాటు ఒక స్టేడియం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ మహోత్సవంలో ఎంపీ పసునూరి దయాకర్, శాసనసభ్యులు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ ప్రకాశ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: "కాళేశ్వరం... రైతుల కాళ్లు కడిగి, కన్నీళ్లు తుడుస్తుంది"