దక్షిణ కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన కొనసాగుతుండడంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో... ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.
మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. సంబానినగర్, కొత్తగూడెం మధ్య వాగులు పొంగిపొర్లుతున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే సూచనలున్నాయని... హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం