వరంగల్ నగరంలో శుక్రవారం వర్షం జోరుగా కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వానతో నగరం తడిసి ముద్దైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డు రావాణా వ్యవస్థ స్తంభించింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. మురుగునీరు రోడ్డుపైకి రావడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'