మానసికంగా ధైర్యం లేకుంటే.. బలవంతుడు కూడా బలహీనుడౌతాడన్నది అందరూ గుర్తుంచుకోవాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు బరుపాటి గోపి తెలిపారు. వైరస్ సోకిందనుకుంటే.. నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇంట్లో ఉండడం ఇబ్బందిగా.. నిర్బంధంగా భావించకూడదని.. కుటుంబ సభ్యులతో గడిపేందుకు చక్కని అవకాశంగా భావించాలని వివరించారు. అలా గడపడం వల్ల మానసిక సమస్యలు చాలావరకు తగ్గుతాయన్నారు. భయపడినా.. ఆందోళన చెందిన రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు.
ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ.. మానసిక సమస్యలు తగ్గించుకోవాలని గోపీ సూచించారు. ప్రాణం అన్నింటికన్నా ముఖ్యమన్నది గ్రహిస్తే.. మద్యం ఇతర అలావాట్లు కలిగిన వారు ఇక్కట్లు పడరని స్పష్టం చేశారు. వైరస్ బారిన పడకుండా...ఇతరులకు అంటించకుండా.. ఉంటే ప్రస్తుత పరిస్ధితిల్లో సైనికుడిలా దేశానికి సేవ చేసినట్లేనంటున్న మానసిక వైద్య నిపుణుడు గోపీతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?