మొక్కలను నాటాడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెట్లు ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు.
ఇవీ చూడండి: రాజకీయపార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం భేటీ