ETV Bharat / state

అదిరే రంగులతో ముస్తాబైన జీడబ్లూఎంసీ క్యాంటీన్​

author img

By

Published : Jul 31, 2020, 3:29 PM IST

వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం క్యాంటీన్​ కొత్త రూపు సంతరించుకుంది. క్యాంటీన్​ గోడలపై రంగురంగుల బొమ్మలు వేశారు. క్యాంటీన్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.

gwmc
gwmc

వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం నూతన శోభను సంతరించుకుంది. మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో కార్యాలయం ఆవరణలోని క్యాంటీన్​ను రంగు రంగుల బొమ్మలతో అందంగా ముస్తాబు చేశారు. గోడలపై ఏకశిలా ఆర్ట్ క్రియేషన్ చిత్రకారులు వేసిన చిత్రాలు ఆకర్షిస్తున్నాయి.

స్మార్ట్ సిటీలో భాగంగా కార్యాలయానికి కొత్త శోభను తీసుకురావాలనే ఆలోచనతో కార్యాలయ గోడలతో పాటు క్యాంటీన్​ను అందంగా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి కషాయం తాగారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యం వద్దు.. కరోనాకు చంపే శక్తి లేదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.