వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో కరోనాతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు మైలగాని సాంబరాజు సంతాప సభను మిత్ర బృందం సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్నేహితులంతా కలిసి సాంబరాజు కుటుంబానికి 2 లక్షల 93 వేల 500 రూపాయల నగదును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అహర్నిశలు పోరాటం చేసిన సాంబరాజు లాంటి ఉద్యమ కారులకు రాష్ట్రం వచ్చిన తర్వాత సరైన గౌరవం దక్కలేదని తెజస జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదులాపురం తిరుపతి వాపోయారు.
సాంబరాజు తెలంగాణ విద్యావంతుల వేదిక జేఏసీ సభ్యునిగా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని... కానీ కరోనా సోకి సరైన చికిత్స అందక మృతి చెందడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడు సాంబరాజు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి తిరుపతి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి సాంబరాజు కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటానన్నారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి