ETV Bharat / state

ఆరోగ్య తెలంగాణను సాకారం చేద్దాం: తమిళిసై - గవర్నర్​ తాజా వార్త

వరంగల్​ పర్యటనలో భాగంగా హన్మకొండలోని రెడ్​క్రాస్​ సంస్థను గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ సందర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న ఆయుష్మాన్​ భారత్​, ఆరోగ్య శ్రీ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ఆమె పిలుపునిచ్చారు.

governor-visit-to-red-cross-organisation-in-warangal
ఆరోగ్య తెలంగాణను సాకారం చేద్దాం: తమిళిసై
author img

By

Published : Dec 9, 2019, 7:59 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆయుష్మాన్ భవ, ఆరోగ్య శ్రీ పథకాల ద్వారా ప్రతి పౌరుడు లబ్ధిపొందాలని, తద్వారా ఆరోగ్య తెలంగాణ సాకారం కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండలోని రెడ్​క్రాస్ సంస్థను గవర్నర్ సందర్శించారు. రెడ్​క్రాస్ ఆవరణలో మొక్కలు నాటారు. జనరిక్ మందుల దుకాణాన్ని, రక్తనిధి కేంద్రాన్ని సందర్శించారు. నూతనంగా నిర్మించనున్న తలసేమియా అదనపు భవనానికి గవర్నర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం జూనియర్ యూత్ రెడ్​క్రాస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వరంగల్ రెడ్​క్రాస్ సేవలను కొనియాడారు. ప్రాణాలు హరిస్తున్న డెంగీకి సవాల్ విసిరేందుకు...హైదరాబాద్​లో ఐసీఎంఆర్ ప్రాజెక్టు రాబోతుందని సౌందర రాజన్​ తెలిపారు. వ్యాధి కన్నా మందుల ధరల గురించే రోగులు ఆందోళన చెందుతున్నారని.. జనరిక్‌ మందుల షాపుల్లో తక్కువ ధరలకే లభించడం గొప్ప విషయమని గవర్నర్ తెలిపారు.

ఆరోగ్య తెలంగాణను సాకారం చేద్దాం: తమిళిసై

ఇదీ చూడండి: హన్మకొండకు చేరుకున్న తమిళిసై

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.