ETV Bharat / state

మా కలనిజం చేశారు.. సీఎం సార్.. మీకు థ్యాంక్స్

New Government Medical Colleges: పేదవిద్యార్థుల కలనిజం చేసేలా రాష్ట్రసర్కార్‌.. ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కాలేజీలతో ఎందరో నిరుపేద విద్యార్థులు, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశం పొందలేనివారు.. సర్కారు సహకారంతో వైద్యవిద్య అభ్యసిస్తున్నారు.

మెడికల్​ కాలేజీలు
మెడికల్​ కాలేజీలు
author img

By

Published : Nov 21, 2022, 4:49 PM IST

పేదవిద్యార్థుల కలనిజం చేసేలా.. రాష్ట్రంలో 8 కొత్త మెడికల్​ కాలేజీలు

New Government Medical Colleges: ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 8 వైద్య కళాశాలలు ఒకేసారి ప్రారంభం కావడం వైద్యరంగంలో చరిత్రాత్మకమే. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. గిరిపుత్రుల జిల్లాగా పేరొందిన మహబూబాబాద్‌లో కొత్త వైద్యకళాశాల ఏర్పాటుకావడం తక్కువ సమయంలో అన్ని హంగులతో కళాశాల అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అధునాతన భవనంలో తరగతులతోపాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రయోగశాలలు ప్రారంభమవుతున్నాయని అధ్యాపకులు తెలిపారు. ప్రస్తుతం ఈ వైద్యకాలేజీలో 150 సీట్లుఉండగా.. 92 మంది ప్రవేశం పొందారు. హైదరాబాద్ నుంచే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. వైద్యవిద్య చదవాలన్న తమకల నేరవేరిందని కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్ధులు చెబుతున్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో చదివే స్తోమత లేని తమకు.. ప్రభుత్వ కళాశాలలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి చదివి, కళాశాల మొదటి బ్యాచ్‌గా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని విద్యార్ధులు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.