వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. దవాఖానా ముందు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సమ్మె చేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రాణాలకి తెగించి పనిచేసిన పూర్తి వేతనాలు అందించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలను సంవత్సరాలుగా పెంచకుండా ఏజెన్సీలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.
అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రసూతి ఆసుపత్రిని ఎంజీఎం తరహాలో నిర్మించి.. ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 73 ఏళ్ల బామ్మకు వరుడు కావాలట- షరతులు ఇవే!