రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా హసన్‌పర్తి మండలం పలివేల్పులలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి ఆయన రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రైతును సంఘటిత శక్తిగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. రైతు వేదికలను దసరా వరకు పూర్తి చేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు