బాలల హక్కులను కాపాడాటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హన్మకొండలో జిల్లా బాల కార్మిక నిర్మూలన సంస్థ రూపొందించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సంస్థ రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఆపదలో ఉన్న బాల బాలికలను చేరదీసేందుకు చైల్డ్ లైన్ 1098 వారికి ప్రత్యేక వాహన సౌకర్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమగ్ర బాలల పరిరక్షణ కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వినయ్ భాస్కర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'