పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాలని కార్యకర్తలను కోరారు.
పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని వినయ్ భాస్కర్ అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పేర్కొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు