Fake Seeds Selling Gang arrested in Warangal : రైతుల ఆశలను సొమ్ము చేసుకోవాలని కొందరు నకిలీ విత్తనాలను మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు రైతులంతా వానాకాలం పంట పనులు మొదలు పెడుతున్న సమయంలోో విత్తనాలకు డిమాండ్ ఉంటుందని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలు తయారు చేసే 15 మంది సభ్యుల రెండు ముఠాలను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.5 కోట్లకు పైగా విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను సరఫరా చేసే డీసీఎం, కారుతో పాటు నకిలీ విత్తనాల తయారీ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమైన తరుణంలో నకిలీ విత్తన విక్రయదారులు జోరు పెంచుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి అన్నదాతలను మోసం చేసి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. విత్తనాలు నకిలీవని తెలియక వాటిని కొనుగోలు చేసి రైతులు నిండా మునుగుతున్నారు. పంట ఎదుగుదల లేక దిగుబడి రాక నష్టాలపాలవుతున్నారు.
Arrest of a gang selling non-scientific seeds : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన 15 మందిని తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.5 కోట్లకు పైగా విలువైన 12 టన్నుల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు . 9765 నకిలీ విత్తన ప్యాకెట్లు, ఒక డీసీఎం, కారు, రూ.21 లక్షల నగదు, విత్తనాలను తయారు చేసేందుకు అవసరమమైన యంత్రాలను, సామగ్రినీ స్వాధీనపర్చుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్సు, మడికొండ, ఎనుమాముల పోలీసులు కలిసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.
Task force Teams to Control Fake Seeds : నకిలీ విత్తనాల కట్టడికై ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు
'ఇవి పత్తి విత్తనాలు కాదు. పత్తిని జిమ్మింగ్ చేశాక వచ్చిన విత్తనం ఉంటది కదా దాన్ని విత్తనాల కింద అమ్ముతున్నారు. అసలు చేయాల్సిన పద్ధతి ఏంటంటే.. ఒక విత్తనాన్ని అభివృద్ధి చేయాలంటే దానికి సంబంధించిన సీడ్ గ్రోయేర్ ఉంటారు. వారు విత్తనాలను పెంచిన తర్వాత విత్తనాలను విక్రయించే కంపెనీలు వాటి క్వాలిటీ చూసి మంచివి తీసుకొని మార్కెట్లో అమ్మకానికి పెడతారు. ఇది అసలు జరిగే ప్రాసెస్. ఇలా కాకుండా పత్తి నుంచి దూది తీసి అందులో ఉండే గింజలకు రంగులు కొట్టి అమ్ముతున్నారు.' -ఏ.వి. రంగనాథ్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్
ఆకర్షణీయంగా ప్యాక్ చేసి..: నిందితులు వివిధ రకాల పేర్లున్న కంపెనీల కవర్లలో.. నకిలీ విత్తనాలను ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వాటిని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలతో సోదాలు చేశామని ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రుల ఆదేశాలతో.. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆన్లైన్ ద్వారా విత్తనాలు తెప్పించుకుంటూ.. రైతులు మోసపోతున్నారని.. అలా విక్రయించే వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదలిపెట్టబోమని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని తక్కువ ధరకే వస్తున్నాయని కొనుగోలు చేయవద్దని ముఖ్యంగా ఆన్లైన్లో దొరికే వాటిని తీసుకోవద్దని సీపీ సూచించారు.
ఇవీ చదవండి: