వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరు ప్రయాణించాలని ప్రభుత్వ ఛీప్ విప్ వినయ భాస్కర్ తెలిపారు. గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహం దీక్ష ప్రేరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకవచ్చారని చెప్పారు.
ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి