వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. వరంగల్ మున్సిపాలిటీ వారు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా సూపర్ స్ప్రెడర్లకు, ఇతర వారికి టీకాలు వేస్తున్నారు. ఇందుకోసం నగరంలో 5 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికి పైగా టీకాలు తీసుకుంటున్నారు.
అర్హులందరూ ఉదయం నుంచే వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు చేరుకొని క్యూలో నిల్చుంటున్నారు. అయితే ముందురోజు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే దగ్గర మాత్రం ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. మాస్కు ధరించని, భౌతిక దూరం పాటించని వారికి టీకాలు ఇవ్వమని చెప్పడం వల్ల వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం నిబంధనలను పాటిస్తున్నారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ