మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పార్టీ నేతల మధ్య ఉన్న మనస్పర్ధలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మాజీ కౌన్సిలర్ ధూపం సంపత్ వర్గం.. 13వ డివిజన్ అధ్యక్షుని వర్గం మధ్య విభేదాలతో వర్ధంతి వేడుకలను హుటాహుటిన ముగించారు.
అనంతరం నేతలు ఒకరినొకరు దోషించుకున్నారు. ఇందిరా గాంధీ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేశామని ఓ వర్గం.. ఆమె కార్యాలయాన్ని మేము నిర్మించామంటూ మరో వర్గం వాదనకు దిగారు.
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటం వల్ల నేతలు తమ తమ బలాన్ని నిరూపించుకోవడానికే వర్ధంతి వేడుకలను రాద్ధాంతం చేశారని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.