వరంగల్‌లో జరిగిన ఓ పెళ్ళిలో.. న్యూజిలాండ్, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశస్థులు 14 మంది సందడి చేశారు. శంభునిపేటకు చెందిన సంగీతకు... పెద్దపల్లికి చెందిన అభిషేక్‌తో వివాహం జరగ్గా... విదేశీయులు అతిథులుగా హాజరయ్యారు. పెళ్లికూతురు సంగీత... న్యూజిలాండ్‌లో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. అక్కడ తన స్నేహితులను పెళ్లికి పిలవగా... వారంతా వరంగల్‌కు విచ్చేసి సరదాగా గడిపారు. వివాహ వేడుకల్లో... పట్టుబట్టలు కట్టి పెళ్లి తుంతును ఆస్వాదించారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, వివాహ విధానం చూసి ఫిదా అయ్యామంటున్నారు ఈ విదేశీ అతిథులు.
ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!