పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ శివారు హసన్ పర్తిలో చోటుచేసుకుంది. పొలాల్లో ఉన్న వరి, గడ్డి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సీతంపేటకు చెందిన యాదయ్యకు చెందిన ధాన్యం మంటలకు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నీటి ట్యాంకర్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చూడండి : స్థానిక సంస్థలు 'చే' జారకుండా కాంగ్రెస్ కసరత్తు