పేదల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
60 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. చెక్కులతో పాటు మొక్కలనూ అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు.
ఇవీచూడండి: స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయొద్దు: హైకోర్టు