త్రిదళ్ అకాడమీలో శిక్షణ పొంది ఆర్మీ, నేవిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను వరంగల్ అర్బన్ జిల్లా స్పెషల్ కలెక్టర్ మనుచౌదరి అభినందించారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ (టాస్క్) సహకారంతోనే త్రిదళ్ సంస్థ శిక్షణ అందించింది. ఖాజీపేట మండలం రాంపూర్‌లో త్రిదళ్ అకాడమీ ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి టాస్క్ డైరెక్టర్ మాజీ ఆర్మీ బ్రిగేడియర్ శ్రీరాములుతో కలిసి ఆయన హజరయ్యారు.
ఆర్మీ, నేవిల్లో ప్రస్తుతం 29 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించినట్లు సంస్థ తెలిపింది. మొత్తంగా 40 మందికి పైగా ఇక్కడ శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించడం పట్ల అకాడమీ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. మున్ముందు రక్షణ రంగంలో మరింత మంది ఉద్యోగాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని టాస్క్ డైరెక్టర్ శ్రీరాములు స్పష్టం చేశారు. కొలువులు సొంతం చేసుకున్న వారంతా ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగాలని జిల్లా స్పెషల్ కలెక్టర్ మను చౌదరి ఆకాంక్షించారు.
ఇవీ చూడండి : 'హామీలు నెరవేర్చని తెరాసకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది'