ETV Bharat / state

పత్తి సాగుకు రైతన్నల మొగ్గు.. విత్తనాల ధరలు పెంచేసిన కంపెనీలు - cotton cultivation in warangal district

పత్తి రైతులపై విత్తన కంపెనీలు అదనపు భారాన్ని వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈసారి రూ.50 నుంచి రూ.150 వరకు అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తున్నారు. స్థానికంగా ఎక్కువ ధర ఉండటంతో.. మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచి వరంగల్‌కి వచ్చి రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

పత్తి సాగుకు రైతన్నల మొగ్గు.. విత్తనాల ధరలు పెంచేసిన కంపెనీలు

author img

By

Published : Jun 21, 2022, 10:34 AM IST

పత్తి సాగుకు రైతన్నల మొగ్గు.. విత్తనాల ధరలు పెంచేసిన కంపెనీలు

తెల్ల బంగారంగా పిలిచే పత్తికి.. ఈసారి మార్కెట్​లో మంచి ధర పలికింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో గతంలో ఎప్పుడూ లేనంతగా.. క్వింటా రూ.14 వేల ధర పలికింది. మంచి ధర పలుకుతుండడంతో.. రైతులు ఈసారి పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పత్తిసాగును ప్రోత్సహిస్తోంది. ఇక తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులు కూడా.. పత్తిసాగు వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్‌లో పత్తి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఈ వానాకాలం సీజన్‌లో పత్తి పంట 7,84,500 ఎకరాల్లో సాగవుతుందని.. వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా విస్తారంగా వర్షాలు కురవకపోవడం.. రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. వర్షాలు పడిన చోట్ల.. రైతులు వ్యవసాయ పనుల జోరు పెంచారు.

వరంగల్​కు వచ్చి కొనుగోళ్లు.. అటు పత్తి విత్తనాల ధరలు రైతులకు అదనపు భారాన్ని మోపుతున్నాయి. గత సంవత్సరం కంటే.. రూ.50 నుంచి రూ.100, రూ.150 వరకూ అధికంగా కంపెనీలు విక్రయిస్తున్నారు. ఇది తమకు భారంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విత్తన ధరలు ఎక్కువ కావటంతో.. మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల నుంచీ రైతులు.. వరంగల్‌కి వచ్చి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.

ఇంకెంత పెంచుతారో.. పత్తికి డిమాండ్ బాగా ఉండడంతో.. దీన్ని ఆసరాగా చేసుకుని.. పలు కంపెనీలు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నాయి. వచ్చే వారం, పది రోజుల్లో వ్యవసాయ పనులు మరింత జోరు పెరుగుతాయని.. విత్తన ధరలు ఇంకెంత పెంచుతారోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు విక్రయించేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.

ఇవీ చూడండి..

కలపతో కళాకృతులు.. చూసేందుకు చాలవు రెండు కన్నులు!!

ఉద్ధవ్​ సర్కార్​కు షాక్​.. మంత్రి తిరుగుబాటు.. 11 మంది ఎమ్మెల్యేలతో జంప్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.