పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో దూసుకుపోతుంటే చూసి ఓర్వలేక విపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఏఏపై అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
ఇవీచూడండి: 'పౌరచట్టంపై కాదు.. పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'