లాక్ డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయిన పేదలకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అండగా నిలిచారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు.. తన నియోజకవర్గంలోని పేదలకు సరకులను అందజేసినట్లు తెలిపారు.
వీధి వ్యాపారులపై..లాక్ డౌన్ పెను ప్రభావం చూపిందని.. ప్రస్తుతం ఆంక్షలు సడలించినా వ్యాపారం జరిగే అవకాశం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలు కనీసం రెండు పూటలు కూడా.. కడుపు నిండ తినే పరిస్థితి లేదని వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో సహాయం చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా