Errabelli Pradeep Rao: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలపై తెరాస రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. నరేందర్ మానసిక ఒత్తిడికి గురై ప్రజలను నాయకులను దూషించడం సరికాదని హితవు పలికారు. తన అండతోనే ఆయన ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. వెంటనే ఎమ్మెల్యే నరేందర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యుడి హోదాలో ఉండి అనవసరంగా వ్యక్తిగత దూషణలకు పోకూడదని ప్రదీప్ రావు సూచించారు.
ఎమ్మెల్యేగా నరేందర్ ఎన్నికైన తర్వాత తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రదీప్ రావు ఆరోపించారు. ఆయన చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయలని.. లేదంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రేపు మధ్యాహ్నం వరకు తెరాసలో కొనసాగేది.. రాజీనామా చేసే దానిపై స్పష్టత ఇస్తానని ప్రదీప్ రావు చెప్పారు. తెరాస వల్ల తనకు, తన అనుచరులకు ఎలాంటి లబ్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు చేయడం బాధాకరమని ప్రదీప్ రావు అన్నారు.
"నేను రేపటి నుంచి పార్టీలో కొనసాగను. మా సహకారంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు. కాదు అంటే రాజీనామా చేసి రావచ్చు. అవసరమైతే పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయవచ్చు. నేను ఇండింపెండెట్గా నిలబడతాను. లేదు రూ.4000వేల కోట్లు తెచ్చి వరంగల్ ఈస్ట్‌ను ఎక్కడి అభివృద్ధి చేశావో చూపించాలని డిమాండ్ చేస్తున్నాం." -ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తెరాస రాష్ట్ర నాయకులు
ఇవీ చదవండి: Telangana Inter Board : పెద్దలు చెబితే.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఓకే..