గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేసి పల్లెలను అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాలకు సంబంధించి హన్మకొండలో నిర్వహించిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధుల అవగాహన సభకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో పనిచేసి... గ్రామాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి నియమకం చేపట్టామని.... ప్రతి పైసా గ్రామాభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. పంచాయతీలకు నిధుల సమస్యే లేదని... ఇటీవలే రూ. 348 కోట్ల రూపాయల మేర విడుదల చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, హరిత, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శనరెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి...షటర్ కు కన్నం..600 గ్రాముల బంగారం చోరీ