వరంగల్ అర్బన్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలోని అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
భవానీ మాతా అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు గుమిగూడకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి.. సరస్వతీ దేవి అవతారంలో జగన్మాత..