రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి ఆలయం తెరుచుకుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తీర్థం, ప్రసాదం.. నిషేధం
ఆలయ పరిసరాల్లో నిత్యం సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకుని.. భౌతిక దూరం పాటిస్తూ వరుసలో నిలబడ్డారు. కేవలం దర్శనం మాత్రమేనని.. తీర్థం, ప్రసాదం, ప్రత్యేక పూజలు ఏమీ లేవని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీత స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు