వరంగల్‌లో మహశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామునే శివాలయాలకు చేరుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు.
ఉదయం నుంచే రుద్రేశ్వరున్ని దర్శించుకోవడానికి ఆలయం ముందు భక్తులు బారులు తీరారు. రుద్రేశ్వరునికి పాలభిషేకం చేసి తన్మయత్వం చెందారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈరోజు సాయంత్రం ఆలయంలో శివపార్వతుల కల్యాణం జరుగనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:కథ సుఖాంతం.. కన్నతల్లి చెంతకు గీత