నిరుపేద నాయీ బ్రాహ్మణులకు... నిత్యావసర వస్తువులను అందిస్తూ.. ఓరుగల్లు నాయీ అభ్యుదయ సంఘం దాతృత్వాన్ని చాటుకుంటోంది. సంఘం నాయకులు... ఇంటింటీకీ వెళ్లి పూట గడవని నిరుపేదలకు బియ్యం పప్పూ ఉప్పులు ఇతర సరకులు అందించి అండగా నిలుస్తున్నారు. కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం తమ బాధ్యతని.. ఇక ముందు కూడా ఇదే విధంగా సాయం చేస్తామని వారు చెపుతున్నారు. ప్రభుత్వం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని లాక్డౌన్ను విజయవంతం చేయాలని వారు అన్నారు. స్వీయ జాగ్రత్తలు పాటించి.. కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు.
ఇవీ చూడండి: 'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'