క్రికెట్‌పై మక్కువను చాటుకున్నాడు వరంగల్ నగరానికి చెందిన కళాకారుడు రామ్మోహన్. గాజు సీసాలో ప్రపంచ కప్పు నమూనాను వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. ఏ దేశానికి ఏ సంవత్సరంలో ప్రపంచ కప్ వచ్చిందో పూర్తి వివరాలు అందులో పొందుపర్చాడు. ప్రపంచ్ కప్ టోర్నిలో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ నమూనా తయారు చేశానని ఇందుకోసం 40 రోజుల సమయం పట్టిందని తెలిపాడు.
ఇవీ చూడండి: భారత్ X కివీస్: తొలి సెమీస్‌లో ఢీ అంటే ఢీ