కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) వరంగల్‌లో తమ మొట్టమొదటి ప్రాపర్టీ షోను నిర్వహించింది. హన్మకొండలోని నందన గార్డెన్లో రెండు రోజులపాటు జరిగే ప్రాపర్టీ షోను ప్రభుత్వ ఛీప్ విప్ వినయ భాస్కర్, ఎమ్మెల్యేలు రమేష్, ధర్మారెడ్డి, సతీష్‌లు ప్రారంభించారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరం విద్య, వ్యాపార, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించడం సంతోషకరమన్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకర్లు, కన్సల్టెంట్లను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ ప్రాపర్టీషోను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలంగాణ క్రెడాయి ఛైర్మన్ రాంరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి : అకాల వర్షాలు.. అన్నదాతలకు కష్టాలు