వరంగల్ అర్బన్ జిల్లాలో ఈసారి మామిడి పూత విరగబూసింది. తోటనిండా చెట్లు పచ్చని పూతతో కనువిందు చేస్తున్నాయి. ఈసారి నిండా పూత రావడం వల్ల మామిడి రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణం అనుకూలించి పూత ఆఖరు దాకా నిలబడితే ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గత సంవత్సరం పూత దశలో భాగానే ఉన్నప్పటికీ... వాతావరణ మార్పుల వల్ల పిందె రాలిపోయి ఆశించిన దిగుబడి రాలేదని తెలిపారు.
ఇదీ చూడండి: ఆధార్ కేంద్రాల్లో 'రేషన్' బారులు