ETV Bharat / state

'వ్యాక్సిన్​ తీసుకున్నా కొవిడ్​ నిబంధనలు తప్పక పాటించాలి' - warangal urban district latest news

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ, సోమిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్​ వ్యాక్సినేషన్​ను ప్రారంభించారు. మొదటగా అంగన్​వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేశారు.

covid vaccination launch in Kadipikonda, Somidi primary health centers
వ్యాక్సిన్​ తీసుకున్నా కొవిడ్​ నిబంధనలు తప్పక పాటించాలి
author img

By

Published : Jan 19, 2021, 3:32 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ, సోమిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్​ను వైద్యాధికారులు ప్రారంభించారు. మొదటగా అంగన్​వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్​ సూపర్​వైజర్​లకు టీకా వేశారు. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి ఈ రోజు సుమారు 170 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

మరో 28 రోజుల తర్వాత వీరికి రెండో విడత టీకాను ఇస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్​ను తీసుకున్నప్పటికీ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని... కడిపికొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని శైలజ తెలిపారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.