ETV Bharat / state

ఓరుగల్లులో 36 రోజుల తర్వాత పాజిటివ్‌ కేసు - హన్మకొండ కుమార్‌పల్లిలో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌

హన్మకొండ కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మూడు రోజుల క్రితం పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా కరోనా లక్షణాలు కనిపించడం వల్ల.. ఈనెల 29న ఎంజీఎంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసి వైరస్ నిర్థారించారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, టెక్నీషియన్లను హోంక్వారంటైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Covid positives were reported after 36 days in Warangal Urban.
ఓరుగల్లులో 36 రోజుల తర్వాత పాజిటివ్‌ కేసు
author img

By

Published : May 31, 2020, 3:23 PM IST

వరంగల్‌ అర్బన్‌లో 36 రోజుల తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. హన్మకొండ కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మూడు రోజుల క్రితం హన్మకొండ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు కనిపించడం వల్ల ఈనెల 29న ఎంజీఎంలో చేర్చుకున్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల నివేదికలో అతనికి పాజిటివ్‌ అని నివేదిక వచ్చిందని కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, టెక్నీషియన్లను హోంక్వారంటైన్‌ చేసినట్లు వెల్లడించారు.

అధికారులు అప్రమత్తం..

వేలేరు మండలం ఎర్రబెల్లి తండాకు చెందిన 13 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌రాగా.. దాదాపు 36 రోజుల తర్వాత నగరంలోని వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడం వల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టూ కిలోమీటరు వరకు అన్ని నివాసాలపై దృష్టి పెట్టనున్నట్లు జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీకృష్ణారావు తెలిపారు.

ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.