ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరు గడించిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు వ్యాపారులు అనేక కొర్రీలు పెడుతూ... తక్కువ ధరలకు సరుకును కొనుగోలు చేస్తున్నారు. తాజాగా పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ పంటను ఎండపోయాలని రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే..పత్తిని ఆరబెట్టమనడంపై రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మక్కలు, కందులు, పెసర్లు ఆరబెట్టడం చూసామని మొదటి సారిగా పత్తిని ఆరబెట్టడం ఇప్పుడే చూస్తున్నామని వాపోతున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రేపే రెండో విడత స్థానిక సమరం