బెంగుళూరు నుంచి నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట రైల్వేస్టేషన్లో గంటా ఇరవై నిమిషాలపాటు నిలిపేశారు. కరోనా వైరస్ అనుమానిత జంట అందులో ప్రయాణిస్తున్నారంటూ ప్రయాణీకులు అధికారులకు సమాచారం అందించారు. ఉన్నాతాధికారుల సూచన మేరకు వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
దంపతులు విహారయాత్ర నిమిత్తం బాలికి వెళ్లి ఇటీవలే తిరిగి రాగా....శంషాబాద్ విమానాశ్రయంలో హోం క్వారెంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ వారు బేఖాతరు చేసి స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌కు రైలులో బయలుదేరివెళ్తున్నట్లు పేర్కొన్నారు. దంపతులను ఎంజీఎంకు తరలించి అనంతరం...కోచ్ మొత్తం శానిటైజ్ చేసి అందులోని ప్రయాణీకులకు వేరే కోచ్‌లోకి మార్చిన అనంతరం రైలును పంపించారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం