వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో చైనా నుంచి వచ్చిన వ్యక్తికి ముందస్తుగా వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. 14 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. కొత్తపల్లికి చెందిన బైరి అజయ్ చైనాలో డెంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. గత నెల 29న చైనా నుంచి శ్రీలంక కొలంబియా మీదుగా దిల్లీకి, అక్కడి నుంచి ముంబయి... అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లి అక్కడ 18 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి తిరిగి ఈ నెల 23న భాగ్యనగరానికి చేరుకొని అక్కడి నుంచి సోమవారం రాత్రి భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి వచ్చాడు.
అజయ్ చైనా నుంచి గ్రామానికి వచ్చిన విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది మంగళవారం అజయ్ ఇంటికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. విమానాశ్రయాల్లో వైద్య పరీక్షల రిపోర్టులు పరిశీలించారు. ఆ రిపోర్టుల్లో కరోనా లేనట్లుగా నిర్ధరణ అయిందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా ఆ వ్యక్తిని 14 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. అజయ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. అతనికి కరోనా లేదని నిర్ధరణ కావడం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: 'సానూకుల ధోరణితో వైరస్‌ను పారదోలుదాం'