ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్నది. వరంగల్ అర్బన్ జిల్లాలో జులై 19న 117 కేసులు నమోదు కాగా, జులై 20న 73 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసులు పెరగడం వల్ల వసంత్ పూర్, దీన్ దయాళ్ నగర్, కరీమాబాద్, కొత్తవాడ 80 ఫీట్ రోడ్, మట్వాడా ఎస్ఎస్కే సమాజ్, ఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లి, రెడ్డి కాలనీ, హన్మకొండల్లోని ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు.
ఒక్క సోమవారం రోజే.. మహబూబాబాద్ జిల్లాలో 36, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 26 పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 12మందికి పాజిటవ్ నిర్ధారణ అయింది. ములుగు జిల్లాలో 9 మందికి వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 157 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : గవర్నర్తో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం