ETV Bharat / state

ఎనుమాముల మార్కెట్​ యార్డులో కరోనా అవగాహన ర్యాలీ

వరంగల్ అర్బన్​ జిల్లా​ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ యార్డులో కరోనా నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్​ ఛైర్మన్​తో పాటు మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​ గుండా ప్రకాశ్ కరోనా అవగాహన ర్యాలీని చేపట్టారు.​

corona-awareness-rally-in-yenumamula-mirch-market-yard-at-warangal-urban
ఎనుమాముల మార్కెట్​లో కరోనా అవగాహన ర్యాలీ
author img

By

Published : Mar 19, 2020, 6:33 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ యార్డులో కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మార్కెట్​ యాజమాన్యం విస్తృతంగా ప్రచారం చేసింది. మార్కెట్ ఛైర్మన్​తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాశ్​ అవగాహన ర్యాలీని చేపట్టారు.

మార్కెట్ యార్డుల్లో కలియతిరుగుతూ రైతులకు వైరస్​ నివారణ చర్యలను తెలియజేశారు. జనావాసాల్లో ఉన్నప్పుడు మాస్క్​లను తప్పనిసరిగా ఉపయోగించాలని.. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని మేయర్​ సూచించారు. ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

ఎనుమాముల మార్కెట్​లో కరోనా అవగాహన ర్యాలీ

ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.