వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థితో పాటు ఒకరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.
మధ్యాహ్నం 1 గంటల వరకు నామ పత్రాలను స్వీకరించి.. 2 గంటల నుంచి 3 గంటల వరకు పత్రాలను పరిశీలించనున్నారు. సాయంత్రం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో 'అగ్రిటెక్'