ETV Bharat / state

Constable Killed Mother in law in Hanamakonda : అత్తను గన్​తో కాల్చి చంపిన కానిస్టేబుల్.. అందుకోసమే.. - హనుమకొండలో కాల్పుల ఘటన కలకలం

Constable Killed Mother in law in Hanamakonda : మానవబంధాలను నోట్ల కట్టలు శాసిస్తున్నాయి. అనుబంధాలను ఆర్థిక లావాదేవీలు ఆవిరి చేస్తున్నాయి. మానవత్వాన్ని మంటగలుపుతూ.. ఆస్తిపాస్తుల కోసం కొందరు నరరూప రాక్షసుల్లా మారేందుకైనా సిద్ధమవుతున్నారు. తాజాగా హనుమకొండలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవతో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌.. అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. స్థానికుల ఆగ్రహానికి గురై, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

Son in Law Gun Fire His Aunt in Warangal
Son in Law Gun Fire His Aunt
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 3:05 PM IST

Updated : Oct 12, 2023, 10:22 PM IST

Constable Killed Mother in law in Hanamakonda : సొంత అత్తను గన్​తో కానిస్టేబుల్ కాల్చి చంపిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్త, అల్లుడి మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది. దీంతో ఈరోజు ఉదయం గుండ్లసింగారం గ్రామానికి వచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్.. అత్త కమలమ్మతో మాట్లాడుతున్న క్రమంలో సర్వీస్ రివాల్వర్​తో అత్తపై ఛాతిలో కాల్పులు జరిపాడు.

Hanamakonda Firing Incident : ఈ క్రమంలో అత్త కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పులు జరిపి అక్కడే నిలబడిన కానిస్టేబుల్​పై మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేశారు. నిందితుడికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్​ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మృతురాలు కమలమ్మ
మృతురాలు కమలమ్మ

Gun Firing At Kamareddy : కామారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం... ఒకరికి గాయాలు

Constable Killed His Aunt in Hanamakonda : పోలీసులు, స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలో జరిగిన కాల్పుల ఘటన ఒక్కసారిగా స్ధానికులను భయాందోళనలకు గురి చేసింది. కాలనీలో నివాసముంటున్న కమలమ్మను (58).. అల్లుడు ప్రసాద్ తుపాకీతో కాల్చి చంపాడు. ప్రసాద్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్​లో సివిల్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇవాళ ఉదయం అక్కడి నుంచి నేరుగా గుండ్లసింగారంలోని అత్తగారింటికి వచ్చాడు.

'మా అమ్మ వాళ్లకి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాం. ఆ అప్పు కట్టడానికి మా అమ్మ ఇల్లు బేరం వేసింది. ఇల్లు అమ్మి అప్పు తీరుస్తా అని చెప్పింది. నేను మహిళ పోలీసులను పిలిపించా...మా భర్త నన్ను చూడట్లా అని చెప్తే.. వాళ్లు ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తా అంటున్నారని చెప్పారు. ఇల్లు అమ్మే దాక డబ్బులు అడగొద్దని చెప్పారు. అతను చంపడానికి కారణం మా అత్త, మామ, మా ఆడబిడ్డ వీళ్లే మా అమ్మ చావుకి కారణం.' -రమాదేవి, ప్రసాద్ భార్య

Gun Firing Incident in Hanamakonda : అల్లుడిని చూసిన అత్త ఇంట్లోకి రమ్మంటుండగానే.. తుపాకీ తీసి ఛాతీలో కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు, స్థానికులు.. నిందితుడుని పట్టుకుని దేహశుద్ధి చేశారు. రాళ్లతో కొట్టడంతో నిందితుడు తీవ్ర గాయలపాలైయ్యాడు. రూ.4 లక్షల బాకీ విషయంలో అత్త, అల్లుడి మధ్య కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా ఉండడంతో.. ప్రసాద్ భార్య రమాదేవి, కుమార్తె మధుమితతో తల్లిగారింట సమీపంలోనే వేరుగా ఉంటోంది. కళ్లముందే తన తల్లి చనిపోవడంతో వారంతా కన్నీటి మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

'మా నాన్న 10.30 సమయంలో వచ్చాడు. అత్తమ్మ అని పిలిచాడు.. మా అమ్మమ్మ రా అల్లుడా అని ప్రేమగా పిలిచింది. వచ్చాక కుర్చీ వెయ్యమంటే వేశాం. ఆయన బ్యాగ్​లో అప్పటికీ గన్​ ఉన్న సంగతి మాకు తేలీదు. అమ్మని పిలవమన్నాడు.. వెంటనే పిలిచాను. రూ.4 లక్షల అప్పు కాగితాన్ని తీసుకురావడానికి ఇద్దరం ఇంట్లోకి వెళ్లాం. పక్కన అంటీ చేత వాటర్ తీసుకురామన్నాడు. ఆమె తెచ్చి ఇచ్చింది.. దీంట్లో ఏమిటో పడిందని వాటిని పారబోసాడు. మళ్లీ తీసుకురామంటే ఆంటీ ఇంట్లోకి వెళ్లింది. ఈ లోపల నడిరోడ్డు మీద మా అమ్మమ్మని గన్​తో కాల్చాడు.' -మధుమిత, ప్రసాద్ కుమార్తె

Constable Killed His Aunt News : సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. డీసీపీ బారీ నేతృత్వంలో పోలీసులు.. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితుడు తమ అదుపులో ఉన్నాడని.. సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ బారీ చెప్పారు. అలాగే కమలమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. నిందితుడు ప్రసాద్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ‍

'అత్తవాళ్లు కానిస్టేబుల్​కి బాకీ ఉన్నారని అంటున్నారు. అది ఇన్వెస్టిగేషన్​లో తెలుస్తుంది. బాధితులు.. కానిస్టేబుల్ ఫ్యామిలీ మొత్తం హత్యలో ప్రమేయం ఉందంటున్నారు. అది కూడా మేము చూస్తాం.. దీనికి సంబంధించి వాళ్లని కూడా విచారిస్తాం. దర్యాప్తులో ఎలా వస్తే అలా మేము ముందుకు వెళ్తాం. ప్రస్తుతం అతను మా కస్టడీలో ఉన్నాడు. తుపాకీని కూడా మా కస్టడీలోకి తీసుకున్నాం. చట్టం ఎవరి చుట్టం కాదు.. పక్కా దర్యాప్తు చేస్తున్నాం.' -బారీ, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ

Constable Killed Mother in law in Hanamakonda అత్తను గన్​తో కాల్చి చంపిన కానిస్టేబుల్.. అందుకోసమే..

Hyderabad Hotel Manager Shot Dead : ఉద్యోగం పోయిందనే కోపంలో.. హోటల్​ జనరల్‌ మేనేజర్‌పై కాల్పులు

gun firing at shamirpet : శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం.. కుటుంబ కలహాలే కారణం

Last Updated : Oct 12, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.