ETV Bharat / state

కేయూ అభివృద్ధిపై తెరాస చిన్నచూపు: ఉత్తమ్​

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ఉత్తమ్​, వీహెచ్​, ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేయూ అభివృద్ధిపై తెరాస ప్రభుత్వం దృష్టి సారించలేదని ఉత్తమ్​ ఆరోపించారు. అనంతరం హన్మకొండలోని జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిశారు. ప్రశ్నించే గళం తమదేనని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి రాములు నాయక్​.. పట్టభద్రులు, ఉపాధ్యాయులను కోరారు.

utham kumar reddy, mlc elections
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Mar 4, 2021, 4:10 PM IST

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాంగ్రెస్​తోనే సాధ్యమవుతుందని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలులో భాజపా, తెరాస వైఫల్యం చెందాయని విమర్శించారు. సీనియర్ నేత హనుమంతరావు, అభ్యర్థి రాములు నాయక్​తో కలసి ఉత్తమ్.. వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు, అధ్యాపకులను కలసి ఓట్లు అభ్యర్ధించారు.

విద్యార్థులను మోసం

ఎమ్మెల్సీ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్​లకు ఈసారి షాక్​ ఇస్తాయని ఉత్తమ్ జోస్యం చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు గల కేయూ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి సారించలేదని ఆరోపించారు. వర్శిటీల్లో సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులను దగా చేశారని ధ్వజమెత్తారు. నిరుగ్యోగులకు ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అభ్యర్ధి రాములునాయక్ విమర్శించారు. ప్రశ్నించే గళం తమదేనని.. నూటికి నూరు శాతం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాములు నాయక్​ ధీమా వ్యక్తం చేశారు.

కేయూ అభివృద్ధిపై తెరాస చిన్నచూపు: ఉత్తమ్​

తెరాసకు బుద్ధి చెప్పాలి

అనంతరం హన్మకొండలోని జిల్లా కోర్టులో ఉత్తమ్.. న్యాయవాదులను కలిశారు. నడి రోడ్డుపై న్యాయవాద దంపతులను హత్య చేస్తే ఇంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. తెరాస పాలనలో మద్యం, ఇసుక, భూ మాఫియా పైనే శ్రద్ధ పెట్టారని.. దీనికి అడ్డు చెప్పిన వారిని హత్య చేస్తున్నారని విమర్శించారు. న్యాయవాదులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీకి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. రాములు నాయక్​కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.