ETV Bharat / state

వరంగల్​ ఎంజీఎంలో సౌకర్యాల కల్పనలో విఫలం: శ్రీధర్​ బాబు - మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు ఆరోపించారు. కరోనా సమయంలో తుప్పు పట్టిన మిషన్లతో వైద్యం అందిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు.

Congress MLA Sridhar babu
వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో వసతుల లేమిపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు
author img

By

Published : Apr 21, 2021, 4:57 AM IST

కరోనా సమయంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు విమర్శించారు. కొవిడ్​ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాలం చెల్లిన పరికరాలతో రోగులకు చికిత్స అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేక భారమంతా ఎంజీఎంపైనే పడుతోందన్నారు.

వైరస్​ ప్రమాదకరంగా మారుతుంటే ఆస్పత్రిలో సరైన వసతుల్లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని శ్రీధర్​ బాబు ఆరోపించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం హమీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్నవి సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రానున్న గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఆనంతరం మున్సిపల్ ఎన్నికలపై జిల్లా పార్టీ శ్రేణులతో సమవేశమయ్యారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రారంభం, రోడ్లు నిర్మానుష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.