కుడా పరిధిలోని చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన చెరువుల సంరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి హాజరయ్యారు. గత సమావేశంలో నిర్ణయం తీసుకున్న అంశాల అమలుపై సమీక్షిస్తూ వాటిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
నగరంలో ఉన్న చెరువులకు ఎఫ్‌టీఎల్ ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములు, ప్రభుత్వ భూముల్లో ఎన్ని గృహాలున్నాయో సర్వే చేసి నివేదిక అందజేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు సూచించారు. బఫర్ జోన్ పరిధిలోని భూములకు నాలా బదలాయింపు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. వడ్డేపల్లి, భద్రకాళి చెరువులను పూర్తిగా సమ్మర్ స్టోరేజ్ చెరువులుగా ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పాండు రంగారావు సూచించారు.
ఇదీ చదవండి : అక్టోబర్ నెలలో తిరుమలలో జరిగే ఉత్సవాల వివరాలు ఇవే!