కాళోజీ కళాక్షేత్రం సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని బాల సముద్రంలో హయాగ్రీవ చారి కాంపౌండ్‌లో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
అక్టోబర్ నెల చివరి వరకు సివిల్ పనులను పూర్తి చేసి.. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పర్యటక శాఖ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్' రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు