రైతు వేదికల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతు వేదిక నిర్మాణ పనుల పురోగతిపై హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైతు వేదిక నిర్మాణాల్లో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పని సరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత ఏజెన్సీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతు వేదికలతో పాటే మరుగు దొడ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేయాలని సూచించారు.
పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన గడువులోగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. గోడలకు ఇరువైపులా రైతులకు సంబంధించిన పెయింటింగ్‌లు వేయాలన్నారు.
ఇదీ చూడండి.. ప్రాజెక్టుల్లో లోపాల వల్లే వరుస ప్రమాదాలు: బండి సంజయ్